ఉద్యోగాల పేరుతో మోసాలు..లక్షల్లో రూపాయలు వసూలు

fake-jobsనిరుద్యోగులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఆదిలాబాద్ పోలీసులు. పోస్టల్ డిపార్ట్ మెంట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలిప్పిస్తామని ఆదిలాబాద్ లో ప్రచారం చేసుకుంది ఓ ముఠా. చాలా మంది నిరుద్యోగులు… ఆ ప్రకటనలు చూసి దరఖాస్తులివ్వగా.. ఒక్కొక్కరి దగ్గర లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. పక్కా ప్లాన్ తో నిరుద్యోగులను బుట్టలో వేసుకున్న ఈ ముఠా సభ్యులు… నిన్న ఆదిలాబాద్ శివారులో ఇంటర్వులు చేశారు. ఈ ప్రక్రియపై అనుమానించిన కొందరు అభ్యర్థులు… పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహారెడ్డి టీం.. ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముఠా సభ్యుల మోసం బయటపడటంతో…ఇప్పటికే లక్షల్లో డబ్బులు చెల్లించిన నిరుద్యోగులు…తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates