ఉద్యోగి ఘన కార్యం: చెత్త షాపులో ప‌దో త‌ర‌గ‌తి జ‌వాబు పేపర్లు

answerబీహార్ లో ఓ ఉద్యోగి చేసిన పనికి కొన్ని రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్న పదో తరగతి విద్యార్థులకు ఊరట లభించింది. ఓ చెత్త వ్యాపారి నుంచి అధికారులు 42 వేల 10వ తరగతి ఆన్సర్ షీట్లను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఇటీవ‌ల‌ నిర్వహించిన పదో తరగతి పరీక్షల జవాబు పత్రాలను వ్యాల్యుయేషన్ చేసి గోపాల్‌గంజ్‌లోని ఓ కాలేజీలో భద్రపరిచారు. ఈ నెల 20న ఆన్సర్ పేపర్లు అదృశ్యమయ్యాయి. దీంతో ఫలితాల విడుదలను వాయిదా వేసింది ఆ రాష్ట్ర విద్యాశాఖ. జవాబు పేపర్లు కన్పించకుండా పోవడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఎట్ట‌కేల‌కు కాలేజీ ఉద్యోగి చట్టూ సింగ్…జవాబు పేపర్లను  రూ.8 వేలకు ఓ చెత్త షాపు యజమానికి అమ్మినట్లు కనుగొన్నారు. పోలీసులతో వెళ్లి ఉద్యోగులు జవాబు పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే 10వ తరగతి రిజల్ట్స్ ను విడుదల చేస్తామంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates