ఉద్యోగులకు జెట్ ఎయిర్ వేస్ క్షమాపణలు

ఢిల్లీ: విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ తన కంపెనీ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పింది. వేతనాలు ఇవ్వడంలో ఆలస్యమవుతున్నందుకు క్షమించాలని.. త్వరలోనే వేతనాలు ఇవ్వడానికి కృషి చేస్తామని తెలిపింది. వేతనాలు అందకపోయినా ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వర్తించారని..  సంయమనం పాటించినందుకు అభినందనలు అంటూ  ఉద్యోగులకు మెయిల్ పెట్టింది.

ఆగస్టు నెల వేతనాలకు సంబంధించిన బకాయిలను జెట్‌ఎయిర్‌వేస్‌ అక్టోబర్ మొదట్లో ఉద్యోగులకు చెల్లించింది. కానీ సెప్టెంబరు నెల జీతాలను మాత్రం ఇంకా చెల్లించలేదు. దీంతో ఉద్యోగులకు క్షమాపణలు చెప్తూ  మెయిల్ పెట్టిన జెట్ ఎయిర్ వేస్ మేనేజ్ మెంట్.. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని తెలిపింది.

 

Posted in Uncategorized

Latest Updates