ఉద్యోగుల ప్రమోషన్ల కాలపరిమితి రెండేళ్లకు కుదింపు

telanaganaప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉద్యోగ సంఘాల నేతలతో.. సెక్రటేరియట్ లో సమావేశమైంది.. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా కమిటీ. ఉద్యోగుల బదిలీల మార్గదర్శకాల రూపకల్పనపై చర్చించింది. 18 డిమాండ్లలో భాగమైన ఉద్యోగుల బదిలీలపై.. స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా నేతృత్వంలో కమిటీ ని నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సమావేశమైన మిశ్రా కమిటీ.. ఉద్యోగ బదిలీల మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చించింది. బదిలీలు ఏవిధంగా చేపట్టాలి. ఎప్పటి నుంచి చేపట్టాలనే విషయాలు చర్చకు వచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.

పీఆర్సీ కమిటీ వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలోనూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ల కాలపరిమితిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కమిటీలో ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ లు రఫత్ అలీ, ఉమామహేశ్వరరావు, సీఆర్ బిశ్వాల్ ను ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు జేఏసీ నేతలు.

Posted in Uncategorized

Latest Updates