ఉధృతం అవుతోంది : వేల చెట్ల నరికివేతపై ఢిల్లీలో చిప్కో ఉద్యమం

treesఢిల్లీలో మెగా అభివృద్ధి ప్రాజెక్టు కింద ప్రభుత్వ అధికారుల గృహాలు, కమర్షయల్ కాంప్లెక్స్ కోసం 17వేల చెట్లు నరికే కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. దక్షిణ ఢిల్లీలోని ఏడు కాలనీల్లో పునరాభివృద్ధి పేరుతో వేలాది చెట్లు నరికేయాలని నిర్ణయించింది. ఈ ప్రభుత్వ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు కె.కె.మిశ్రా. ఈ పిటిషన్ పై హైకోర్టు స్పందిస్తూ జూలై 2వ తేదీన తిరిగి విచారణ చేపట్టే వరకు చెట్లు నరకడాన్ని నిలిపి వేయాలని ఆదేశించింది. దక్షిణ ఢిల్లీలో 20 వేలకు పైగా చెట్లు నరికారని, కాగ్ (కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక ప్రకారం ఇక్కడ తొమ్మిది వేల చెట్లు తక్కువగా ఉన్నాయని పిటిషనర్ తెలిపారు.

ఇదిలా ఉండగానే సరోజినీ నగర్‌లో మరో 16వేల 500 చెట్లను తొలగించుటకు సిద్ధంగా ఉంది ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా ఎన్నో పర్యవరణ ఉద్యమాలను నిర్వహించిన చిప్కో ఇప్పుడు ఢిల్లీలో చెట్లు నరకడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమానికి సిద్ధమైంది. అభివృద్ధి పేరుతో కేంద్ర ప్రభుత్వం చెపట్టిన చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజలు చిప్కో ఉద్యమాన్ని చేపట్టారు. ఢిల్లీ వ్యాప్తంగా చిప్కో ఉద్యమాన్ని చేపడుతున్నట్లు  ప్రకటించారు ఉద్యమకారుడు విక్రాంత్‌ తొంగాడ్‌.

వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ కారణంగా.. వాతావరణం కాలుష్యంగా మారి ఢిల్లీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా కేంద్రం చేపట్టిన ఎన్‌బీసీసీ కంపెనీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కూడా చిప్కో ఉద్యమకారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల సరోజినీ నగర్ లో 16,500  చెట్లను నరికివేతకు కేంద్ర అటవీ శాఖ అనుమతులు కూడా ఇచ్చిందని, దీనికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం చెట్లను కౌగిలించుకుని నిరసన వ్యక్తం చేస్తున్నట్లు పర్యవరణ ఉద్యమకారిణి చావీ మేథి తెలిపారు. దీనిపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ)ని ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ ఉద్యమానికి అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు ఆప్‌ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates