ఉన్నావో కేసులో బీజేపి MLA పై FIR నమోదు

upఎట్టకేలకు యూపీ బీజేపి ఎమ్మెల్యే కుల్‌ దీప్‌ సింగ్‌ సెంగర్‌ పై FIR నమోదు చేశారు పోలీసులు. ఉన్నావో జిల్లాలో 16 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం కేసులో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశాలతో ఆయనపై ఈ రోజు(ఏప్రిల్-12) FIR నమోదు చేశారు. కుల్ దీప్ పై సెక్షన్ 363,366,376,506, పోస్కో యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసినట్లు యూపీ డీజీపీ ఓ.పి.సింగ్ తెలిపారు. అయితే కుల్ దీప్ అరెస్టుపై సీబీఐ నిర్ణయం తీసుకుంటుందని పోలీసులు తెలిపారు.
2017 జూన్‌ 4న కుల్ దీప్ తనపై అత్యాచారం చేశాడని, దీని గురించి కంఫ్లెయింట్ చేస్తే తన కుటుంబాన్ని చంపేస్తాడని బెదిరించాడని ఆ యువతి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మరోసారి శరీరంలోకి డ్రగ్స్ ఎక్కించి 9 రోజులపాటు అనేక ప్రాంతాలు తిప్పుతూ అనేకసార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని యువతి ఆరోపించింది. అయితే ఎన్నిసార్లు పోలీసులకు కంఫ్లెయింట్ చేసినా పట్టించుకోపోవడంతో గత వారం సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ప్రయత్నించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసు విషయంలో కుల్ దీప్ కి, బాధితిరాలి తరఫు బంధువులకు జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో బాలిక తండ్రి జైలు పాలయ్యారు. ఆయన కస్టడీలోనే మరణించారు. ఎమ్మెల్యేపై యువతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. ఈ కేసులో తీవ్రమైన వైఫల్యాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. పోలీసులే కాకుండా ఉన్నావో డాక్టర్ల వైఫల్యాలు కూడా ఉన్నట్లు గుర్తించడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Posted in Uncategorized

Latest Updates