ఉపాధికి కేరాఫ్ గా రాష్ట్ర జైళ్లు

ఉపాధి అవకాశాలకు జైళ్లు అడ్డాగా మారాయి. పెట్రోల్ బంకులు, కుటీర పరిశ్రమలతో ఏటా కోట్లు సంపాదిస్తున్నారు ఖైదీలు. నేరాలు చేసి జైలుకెళ్ళిన వాళ్ళలో మార్పు తెస్తున్న జైళ్లశాఖ..సామాజిక బాధ్యతే ధ్యేయమంటోంది. గత నాలుగేళ్ళుగా జైళ్లల్లో తీసుకొచ్చిన సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్ర జైళ్ల శాఖ తీసుకు వచ్చిన సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి.

నాలుగేళ్లుగా  అమలవుతున్న సంస్కరణలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖైదీలకు కొత్త జీవితాన్నిఅందిస్తున్నాయి.  2014 నుంచి ఈ ఏడాది జూన్ వరకు లక్షా 15 వేల 695 ఖైదీలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దింది జైళ్లశాఖ. వీళ్ళందరికీ సంతకాలతో పాటు పేపర్ చదివడం నేర్పారు. మహా పరివర్తనలో భాగంగా 511 మంది ఖైదీలకు పెట్రోల్ బంకుల్లో ఉపాధి కల్పించింది. వీటితో పాటు మరో 2500 మంది మాజీ ఖైదీలకు వివిధ కుటీర పరిశ్రమల్లో ఉపాధి కల్పించింది.

జైళ్లశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకుల్లో 2014 నుంచి ఈ ఏడాది జూన్ వరకు 36 కోట్ల 38 లక్షల టర్నోవర్ చేశారు. ఇందులో గతేడాది సుమారు 13 కోట్ల టర్నోవర్ తో రికార్ట్ సృష్టించింది జైళ్లశాఖ. ఇవే కాకుండా రాష్ట్రాన్ని క్రైమ్ ఫ్రీ స్టేట్ గా మార్చాలనుకున్న పోలీస్  శాఖ టెక్నాలజీతో నేరాగాళ్లకు చెక్ పెడుతోంది. దీంతో ఈ రెండున్నరేళ్లలో ఖైదీల సంఖ్య భారీగా తగ్గింది. 2017లో జైలులో మొత్తం 68,369 మంది ఖైదీలు అడ్మిట్ అవగా…అందులో ప్రస్తుతం జైళ్ళలో ఉన్నది 7091 మంది మాత్రమే. వీళ్ళల్లో 2062 మంది దోషులు శిక్షలు అనుభవిస్తుండగా…3296 మంది అండర్ ట్రైల్ ప్రిజనర్స్ ఉన్నారు. 22 మంది ఖైదీలు చనిపోయారు.

సంస్కరణలతో నేర సమాజాన్నిమార్చాలనుకుంటున్నా..అనేక సవాళ్ళు ఎదురౌతున్నాయని అంటున్నారు జైళ్లశాఖ డీజీ వీకే సింగ్. అయినా సరే సమాజంలో నేరాలు తగ్గించేందుకు గ్రామస్థాయిలో సామాజిక కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఎన్జీఓలతో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించి డ్రాప్ ఔట్ లు తగ్గించేలా ప్రజల్లో అవగాహన తెస్తామని చెబుతున్నారు. ప్రభుత్వాలు, పోలీసులకు ప్రజా సహకారం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రచారం చేస్తామంటున్నారు. సామాజిక బాధ్యత అందరిపై ఉండాలని అంటున్న వీకే సింగ్.. ఏడాదిలో తమ గోల్ రీచ్ అవుతామంటున్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates