ఉప్పల్ టెస్టులో భారత్ వికెట్ల వేట.. షార్దూల్ ఠాకూర్ అరంగేట్రం

ఉప్పల్ : హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టీమిండియా- వెస్టిండీస్ జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్ట్ ఇండీస్ బ్యాటింగ్ తీసుకుంది. షరామామూలుగానే వికెట్లను కోల్పోతోంది. 32 రన్స్ స్కోర్ దగ్గర మొదటి వికెట్… 52 స్కోర్ దగ్గర రెండో వికెట్ ను కోల్పోయింది. ఓపెనర్ బ్రాత్ వైట్(14) ను ఎల్బీగా కులదీప్ యాదవ్ వెనక్కి పంపాడు. పావెల్(22) .. జడేజాకు క్యాచ్ ఇచ్చి అశ్విన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. స్టాండ్ ఐనట్టుగా కనపడిన హోప్(36) ను ఉమేష్ యాదవ్ ఎల్బీగా వెనక్కి పంపాడు.

ఇండియా టీమ్ లో ఒక మార్పు జరిగింది. మహ్మద్ షమీ ప్లేస్ ను… బౌలర్ షార్దూల్ ఠాకూర్ వచ్చాడు. ఈ టెస్ట్ తోనే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెడుతున్నాడు ఠాకూర్. వెస్టిండీస్ టీమ్ లో జాసన్ హోల్డర్ చేరాడు. దేవేంద్ర బిషూకు.. మరో స్పిన్నర్ జోమెల్ వారికెన్ ను చేర్చడంతో.. ఆ జట్టు స్పిన్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates