ఉప్పల్ టెస్ట్: టీమిండియా 367 ఆలౌట్

హైదరాబాద్: భారత్,వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 367 రన్స్ కు ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోర్ 308/4 తో మూడో రోజు గేమ్ స్టార్ట్ చేసిన టీమిండియా 314 రన్స్ దగ్గర రహానె వికెట్ కోల్పోయింది. అదే ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా డకౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత సెంచరీకి దగ్గరగా ఉన్నరిషబ్ పంత్‌ను గాబ్రియెల్ ఔట్ చేశాడు.

దీంతో క్రీజులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్ వెంట వెంటనే ఔటయ్యారు.చివర్లో స్పిన్నర్ రవిచంద్రన్(35)..శార్దుల్ ఠాకూర్‌తో కలిసి భారత్ స్కోర్ ను 350 మార్క్ దాటించారు . విండీస్ బౌలర్లలో హోల్డర్ ఐదు, గాబ్రియెల్ మూడు, వారికన్ రెండు వికెట్లు తీశారు. కేవలం 59 పరుగుల వ్యవధిలో టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయింది. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 56 రన్స్ లీడ్ సాధించింది.

Posted in Uncategorized

Latest Updates