ఉప్పల్ టెస్ట్ : రెండో రోజు భారత్ స్కోర్-308/4

హైదరాబాద్ : ఉప్పల్ వేదికగా భారత్-విండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో పట్టు బిగించింది టీమిండియా. రెండో రోజు (అక్టోబర్-13) ఆటముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 308 రన్స్ చేసింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ 4 రన్స్ కే అవుటైనప్పటికీ, పృథ్వీషా మరోసారి సత్తాచాటాడు. ఫస్ట్ టెస్టు దూకుడును కొనసాగించాడు. 53 బాల్స్ లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 70 రన్స్ చేసి వారికన్ బౌలింగ్‌ లో హెట్‌ మయెర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

చతేశ్వర్ పుజారా 10, కెప్టెన్ విరాట్ కోహ్లీ 45 రన్స్ చేసి ఔటయ్యారు. 81 ఓవర్లు ముగిసేసమయానికి 308/4 రన్స్ చేసింది టీమిండియా. ప్రస్తుతం అజింక్య రహానే 75, రిషబ్ పంత్ 85 రన్స్ తో క్రీజులో ఉన్నారు. 295/7 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన విండీస్ మరో 16 పరుగులు జోడించి మూడు వికెట్లు కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ అద్భుత బౌలింగ్‌ తో అదరగొట్టాడు. 88 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసుకున్నాడు. విండీస్ ఆల్ రౌండర్ రోస్టన్ చేజ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ జాసన్ హోల్డర్ 52 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. వెస్టిండీస్ (311) కంటే 3 రన్స్ వెనుకంజలో ఉంది భారత్.

 

Posted in Uncategorized

Latest Updates