ఉప్పల్ టెస్ట్: రోజుకి 4వేల మంది విద్యార్థులకు ఎంట్రీ ఫ్రీ

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా ఇండియా,విండీస్ మధ్య అక్టోబర్.12నుంచి సెకండ్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇందులో బాగంగా స్కులు  విద్యార్ధులకు ఫ్రీగా ప్రవేశం కల్పించనున్నారు అధికారులు. రోజుకి 4వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. దీంతో పాటు 1500 మంది పోలీసులతో  టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.  100 సీసీ కెమెరాలతో మినిట్ టు మినిట్ నిఘా ఉంటుందని.. 1500 మంది పోలీసులకు తోడుగా స్టేడియం మేనేజ్ మెంట్ కూడా ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసిందన్నారు.

లాప్ టాప్,కెమెరాలు, పవర్ బ్యాంక్,లైటర్స్ ,హెల్మెట్,అవుట్ సైడ్ కు ఫుడ్ కు అనుమతి లేదన్నఆయన సెక్యూరిటీ ఆఫీసర్ల సూచనలతో సెల్ ఫోన్స్ తీసుకెళ్లొచ్చని తెలిపారు.  టు అండ్ ఫోలర్ వీలర్ వెహికల్స్ పార్క్ చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేశామని కమిషనర్ చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates