ఉప్పల్ టెస్ట్: విండీస్ 127 ఆలౌట్

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో(ఫైనల్) టెస్ట్ మ్యాచ్ లో కరీబియన్ టీంకు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. మూడో రోజు గేమ్ స్టార్ట్ చేసిన టీమిండియా 367 రన్స్ కు ఆలౌటైంది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన విండీస్ ఓపెనర్లిద్దరూ డకౌట్ అయ్యారు.

ఉమేశ్ యాదవ్,రవీంద్ర జడేజా సూపర్ బౌలింగ్ తో విండీస్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన రోస్టన్ ఛేజ్ 6 పరుగులే చేసి అవుటయ్యాడు.  టీమిండియా బౌలర్లు చెలరేగడంతో  ఏ దశలోనూ విండీస్ టీం కోలుకోలేకపోయింది. దీంతో విండీస్ 127 రన్స్ కు ఆలౌటైంది.

Posted in Uncategorized

Latest Updates