ఉప్పల్ టెస్ట్ : హైదరాబాదీ కుర్రోడికి నో చాన్స్

భారత్ –వెస్టిండీస్ సెకండ్ టెస్ట్ శుక్రవారం (అక్టోబర్-12) నుంచి జరగనుంది. అయితే హైదరాబాద్ లో సత్తాచాటాలనుకున్న సిటీకి చెందిన క్రికెటర్ సిరాజ్ కు నిరాశ ఎదురైంది. వెస్టిండీస్‌ తో రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ కు సెలక్టయ్యాడు హైదరాబాదీ పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌. ఈ సిరీస్‌ ద్వారా ఇంటర్నేషనల్ టెస్టుల్లో అరంగేట్రం చేయాలనుకున్న ఈ హైదరాబాద్‌ బౌలర్‌ కు మరోసారి బ్యాడ్ న్యూస్ చెప్పింది టీమ్ మేనేజ్‌ మెంట్‌. సిరాజ్‌ తో పాటు మరో తెలుగు క్రికెటర్‌ హనుమ విహారికి సెకండ్ టెస్ట్‌ ఫైనల్ టీమ్ లో చోటు దక్కలేదు.

మ్యాచ్‌ కు ముందు ఒకరోజే 12 మంది ప్లేయర్లతో టీమ్ ను అనౌన్స్ చేసింది BCCI.  శుక్రవారం నుంచి హైదరాబాద్‌ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్టుకు బీసీసీఐ ప్రకటించిన 12 మంది ప్లేయర్లలో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు సిరాజ్‌, విహారిల పేర్లు లేవు.  ఈ ఇద్దరు ఆటగాళ్లు ఫస్ట్ టెస్ట్‌ కూ..  బెంచ్‌ కే పరిమితమయ్యారు. అయితే హైదరాబాద్‌ వేదికగా జరిగే రెండో టెస్టులో ఈ తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లకు అవకాశం లభిస్తోందని అందరూ భావించారు. అందరి అంచనాలను పటాపంచల్‌ చేస్తూ వీరికి అవకాశం కల్పించకుండా టీమ్ ను ప్రకటించింది BCCI.

టీమ్ వివరాలు ఇలా ఉన్నాయి

Posted in Uncategorized

Latest Updates