ఉప్పొంగిన అభిమానం : హరీష్ కు లక్ష ఓట్ల ఆధిక్యం రావాలని..ఫ్రీగా హేయిర్ కటింగ్

సిద్దిపేట : ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో తమ నాయకులను ఆకట్టుకునేలా కార్యకర్తలు పలు సేవలు చేస్తున్నారు. ఇటీవల నల్గొండ జిల్లాలో కేసీఆర్ పై అభిమానంతో ఆయనకు గుడికట్టారు అభిమానులు.  ఈ క్రమంలోనే ఓ అభిమాని చేస్తున్న సేవ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. మంత్రి హరీష్ రావు అభిమాని ఫ్రీగా హేయిర్ కటింగ్, షేవింగ్ చేస్తున్నాడు. తమ నాయకుడు, హరీష్ రావుకు లక్ష ఓట్ల ఆధిక్యం రావాలంటూ.. సిద్దిపేటకు చెందిన నాయీబ్రాహ్మణ యువకుడు కోత్వల్‌ శ్రీనివాస్‌ నిన్న (సెప్టెంబర్-27)న ఫ్రీగా ఈ సేవను ప్రారంభించాడు.

హరీష్ అన్నకే మన ఓటు..కారు గుర్తుకే మన ఓటు అనే ఫ్లెక్సీ బోర్డును సిద్దిపేటలోని హనుమాన్‌ నగర్‌ నడకదారిపై ఏర్పాటుచేసి.. పక్కనే హేయిర్ కటింగ్, షేవింగ్ చేస్తున్నాడు. రోజూ ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇది కొనసాగుతుందని, ఎన్నికలు జరిగి రిజల్ట్ వచ్చే వరకు కటింగ్ చేస్తానని చెప్పాడు శ్రీనివాస్‌.  నాయీబ్రాహ్మణులకు హరీష్ రావు ఎంతో మేలు చేశారని, తనవంతుగా ఈ కార్యక్రమం చేపపెట్టానని తెలిపాడు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు వారికి సన్మానం చేశారు.

Posted in Uncategorized

Latest Updates