ఉప్పొంగి ప్రవహిస్తున్న పండు నది

ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరప్రదేశ్ అతలాకుతలం అవుతుంది. కాన్పూర్ లో పండు నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో… లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. కొద్దిరోజులుగా పండు నదికి వరద ప్రవాహం కొనసాగుతుంది. నది పరివాహక ప్రాంతంలోని 15 గ్రామాలను ఖాళీ చేయించారు అధికారులు. భారీవర్షాల కారణంగా 1200మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 13 రిలీఫ్ సెంటర్లను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యూపీ సర్కార్ ప్రకటించింది. రోడ్లన్నీ జలమయం కావటంతో రాకపోకలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా యూపీ రాష్ట్రవ్యాప్తంగా జులై-1 నుంచి ఆగస్టు-1వరకు 154 మంది చనిపోయారు. 131 మంది గాయాలపాలయ్యారు.

 

Posted in Uncategorized

Latest Updates