పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు : ప్రారంభమైన కౌంటింగ్

POLINGమూడు రోజుల క్రితం వివిధ రాష్ట్రాల్లో జరిగిన 4 పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతుంది. గురువారం (మే-31) ఉదయం నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు మధ్యాహ్నానికి పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా నాలుగు పార్లమెంట్ స్థానాల ఫలితాలపైనే అందరి దృష్టి ఉంది. యూపీలోని కైరానా, మహారాష్ట్రలోని పాల్ఘర్, భండారా-గోండియా, నాగాలాండులోని సోలె స్థానాల్లో ఉపఎన్నికలు జరిగాయి.

నూర్పూర్, షాకోట్, జోకిహట్, గోమియా, సిల్లి, చెంగన్నూర్, పాలస్ కడేగాన్, తరలి, మహేస్తల, రాజరాజేశ్వరి నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నువ్వా.. నేనా అన్నట్లు కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయపార్టీలు పోటీపడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తున్నప్పటికీ చాలా లోకసభ ఉపఎన్నికల్లో ఓటమి చవిచూస్తోంది. విపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావటం… ప్రభుత్వ వ్యతిరేక ఓటును వ్యూహాత్మక భాగస్వామ్యాలతో ఉపఎన్నికల్లో గెలుస్తున్నాయి. కైరానాలో బీజేపీకి RLD పోటీ చేస్తోంది.  RLDకి ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ మద్దతునిచ్చాయి.

మహారాష్ట్రలోని రెండు స్థానాల్లో కాంగ్రెస్ , ఎన్సీపీలు .. బీజేపీకి ఎదురు నిలిచాయి. పాల్ ఘర్ లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన శివసేన కూడా అభ్యర్థిని నిలిపింది. బీజేపీని ఓడించేందుకు ఉపఎన్నికల్లో విపక్షాలన్ని ఒక్కటిగా నిలిచాయి. ఉప ఎన్నికలు జరిగిన నాలుగు లోకసభ స్థానాల్లో మూడు.. కైరానా, పాల్ ఘర్ , భండారా-గోండియా బీజేపీ సిట్టింగ్  స్థానాలు. ప్రస్తుతం లోకసభలో బీజేపీ సంఖ్యాబలం స్పీకర్  కాకుండా 272 మాత్రమే. ఇది సరిగ్గా సాధారణ ఆధిక్యానికి అవసరమైన బలం. ఇందులో ఒక్క స్థానం తగ్గినా విశ్వాస పరీక్షకు వెళ్లాల్సి వస్తే ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై బీజేపీ ఆధారపడక తప్పదు. మరోపక్క సొంతపార్టీల్లోనే కీర్తి ఆజాద్ , శతృఘ్న సిన్హా నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అందరి దృష్టి ప్రధానంగా ఉత్తర ప్రదేశ్ లోని కైరానాపై ఉంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలు రాజీనామా చేసిన లోకసభ స్థానాలను విపక్షాలు గెలుచుకున్నాయి. మరోవైపు ఇక్కడ మైనార్టీ ఓటు బ్యాంకు ఎక్కువ. దీంతో ఈ నియోజకవర్గం ఆసక్తిని కలిగిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates