ఉభయ సభలు నిరవధిక వాయిదా

loksabhaపార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అంతకుముందు లోక్ సభలో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభ్యుల గందరగోళం మధ్యే సభలో జరిగిన కార్యక్రమాల వివరాలు చదివి వినిపించారు. సభ నిర్వహణలో తనకు సహకరించిన ప్రతివారికీ కృతజ్ఞతలు తెలిపారు. సభను నిరవధికంగా వాయిదా వేస్తున్న సందర్భంగా తన నివేదికను చదవాల్సి ఉన్నందున వెల్‌లోనుంచి సభ్యులు తమ సీట్లలోకి వెళ్లాలని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కోరారు. స్పీకర్‌ కోరికతో ప్లకార్డులను కిందికి దించినప్పటికీ వెల్‌లోనే నిలబడ్డారు.

రాజ్య సభలో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభలో జరిగిన కార్యక్రమాలను చదివి వినిపించారు. నెహ్రూ కాలంనుంచి పాటిస్తున్న సభాసంప్రదాయాలను ఆయన చదివి వినిపించారు.

వందేమాతర గీతాలాపన తర్వాత లోక్ సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ , రాజ్యసభలో ఛైర్మన్  వెంకయ్య నాయుడు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Posted in Uncategorized

Latest Updates