ఉమెన్స్ ఆసియా కప్ : ఫైనల్లో భారత్ పై బంగ్లా విజయం

cric
ఉమెన్స్ ఆసియా కప్ టీ20లో భాగంగా ఆదివారం (జూన్-10) బంగ్లాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఓటమిపాలైంది టీమిండియా. 3 వికెట్ల తేడాతో గెలిచింది బంగ్లా   టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్ల ధాటికి ఆరంభ ఓవర్లలో భారత బ్యాట్స్‌ ఉమెన్‌ తడబడ్డారు. వెంటవెంటనే వికెట్లు పోవడంతో ఫస్టాఫ్ లో 42 పరుగులే చేయగలిగారు. అయితే ఆ తర్వాత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ క్రీజులో నిలదొక్కుకోవడంతో  స్కోరు 100 దాటింది.

దూకుడుగా ఆడిన హర్మన్‌ ప్రీత్‌ 42 బంతుల్లో 56 పరుగులతో హాఫ్ సెంచరీ చేసింది. అయితే హర్మన్‌ ప్రీత్‌ కు అవతలివైపు వచ్చిన బ్యాట్స్‌ ఉమెన్ ఎవరూ ఆమెకు సహకరించలేకపోయారు. భారత్ ప్లేయర్లలో హర్మన్‌ ప్రీత్‌(56), మిథాలీరాజ్‌(11), వేదా కృష్ణమూర్తి(11), జులన్ గోస్వామి(10) మినహా మిగతా ఎవరూ రెండంకెల స్కోరు దాటలేదు. వెంటవెంటనే వికెట్లు పడిపోవడంతో భారత జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. 113 రన్స్ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన బంగ్లా 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి  113 పరుగులు చేసి విజయం సాధించింది. మొదటిసారిగా ఆసియా కప్ విజేతగా నిలిచిన బంగ్లా చరిత్ర సృష్టించింది. అయితే లాస్ట్ బాల్ వరకు పోరాడిన భారత్ ప్లేయర్లకు విజయం అందినట్టే వచ్చి.. చేజారింది.  థ్రిల్లింగ్ విక్టరీ బంగ్లా సొంతమైంది.

Posted in Uncategorized

Latest Updates