ఉమెన్స్ క్రికెట్: టీమిండియాదే వన్డే సిరీస్

INDIAఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 2-1తో సొంతం చేసుకొంది. గురువారం(ఏప్రిల్-12) ముంబై నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 8వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

భారత్ ఆటగాళ్లు మిథాలీ రాజ్(74 నాటౌట్), దీప్తి శర్మ(54), స్మృతి మంధాన(53) పరుగులు చేశారు. భారత్‌ మరో 28 బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ ఇచ్చిన టార్గెట్ ను ఛేదించింది. దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. స్మృతి మంధాన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కించుకుంది.

టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌  మొదట బ్యాటింగ్‌ చేసి… నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. భారత్ కు 202 పరుగుల టార్గెట్ ను ఇచ్చింది.

Posted in Uncategorized

Latest Updates