ఉమెన్స్ క్రికెట్ : నేడు ఈస్ట్ లండన్ లో రెండో టీ20

WOMENఉమెన్స్ క్రికెట్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచుల్లో భారత అమ్మాయిలు అదరగొడుతున్నారు. వరుస సీరీస్ లతో దూసుకుపోతున్నారు. వన్డే సిరీ్‌స్ ను 2-1తో గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా.. మొదటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం (ఫిబ్రవరి-16) ఈస్ట్ లండన్ లో జరిగే సెకండ్ టీ20కి సిద్ధమైంది. బ్యాటింగ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన బలంగా కనిపిస్తోంది.

సౌతాఫ్రికాను 164 పరుగుల స్కోరుకే కట్టడి చేసిన భారత్‌.. ఛేదనలో మిథాలీరాజ్‌ అజేయ హాఫ్ సెంచరీతోపాటు అరంగేట్రం ప్లేయర్‌ జెమీమా రోడ్రిగ్స్‌, వేద రాణించడంతో విజయాన్ని అందుకుంది. పర్యాటక జట్టుకు బ్యాటింగ్‌లో ఎటువంటి ఇబ్బందీ లేకపోయినా.. బౌలింగ్‌ విభాగం కొంత ఆందోళన కలిగిస్తోంది. వెటరన్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి గాయం కారణంగా సిరీ్‌సకు దూరం కావడంతో బౌలింగ్‌ విభాగం బలహీనపడింది. జులన్‌ గైర్హాజరీలో పాండే… జట్టు బౌలింగ్‌ భారాన్ని మోయాల్సి ఉంది. ఫస్ట్ మ్యాచ్‌ పరాజయానికి బదులు తీర్చుకోవాలని సౌతాఫ్రికా కసిగా ఉంది. చోల్‌ ట్రయోనా (7 బంతుల్లో 32) ధనాధన్‌ బ్యాటింగ్‌తో భారత బౌలర్లకు చుక్కలు చూపించింది.

రెండో మ్యాచ్‌లో ఆమె భారీ స్కోరు చేయాలని కెప్టెన్‌ డేన్‌ వాన్‌ నీకెర్క్‌ కోరుకుంటోంది.  ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కౌర్ బృందం 1-0 ఆధిక్యంలో ఉంది. హైదరాబాద్ అమ్మాయి మిథాలీ, స్మృతి మందన మరోసారి శుభారంభాన్నిస్తే భారీ స్కోరు ఖాయం. ఫస్ట్ మ్యాచ్‌లో విఫలమైన హర్మన్‌ప్రీత్ కౌర్ గాడిలో పడాల్సిన అవసరం చాలా ఉంది. ఇక మిడిలార్డర్‌లో 17 ఏండ్ల జెమీమా రొడ్రిగ్వేజ్, వేదా కృష్ణమూర్తి మరోసారి కీలకంకానున్నారు. ఆల్‌రౌండర్ రాధా పాటిల్, వికెట్ కీపర్ నుజ్హత్ పర్వీన్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates