ఉమెన్స్ క్రికెట్ : భారత్ బ్యాటింగ్

DWTVclpX0AAsdrAఉమెన్స్ క్రికెట్ లో భాగంగా ఇండియాతో జొహానెస్‌బర్గ్‌ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది సౌతాఫ్రికా. ఇప్పటికే వన్డే సిరీస్ ను భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చరిత్ర సృష్టించడానికి భారత అమ్మాయిల క్రికెట్‌ జట్టుకు కావాల్సింది ఇంకొక్క విజయమే. సౌతాఫ్రికా గడ్డపై ఒకే పర్యటనలో రెండు సిరీస్‌లు సొంతం చేసుకున్న మహిళల తొలి జట్టుగా రికార్డు సాధించేందుకు టీమ్‌ఇండియా మరో మ్యాచ్‌లో గెలిస్తే చాలు. సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉన్న హర్మన్‌ ప్రీత్‌ సారథ్యంలోని భారత్‌.. ఆదివారం (ఫిబ్రవరి-18) జరిగే మూడో మ్యాచ్‌తోనే ఆ ఘనత అందుకోవాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే భారత్‌ 2-1తో వన్డే సిరీస్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌లో మిథాలీ రాజ్‌, స్మృతి మంధాన.. బౌలింగ్‌లో శిఖ, పూనమ్‌ యాదవ్‌ల ఫామ్‌ జట్టుకు కలిసొచ్చే అంశం.
మ్యాచ్ మధ్యాహ్నం 1.15 నుంచి సోనీ టెన్‌-1, 3లో ప్రత్యక్షప్రసారం

Posted in Uncategorized

Latest Updates