ఉమెన్స్ క్రికెట్: మొదటి T20లో భారత్ ఘ‌న విజయం

Mithaliపోట్చెఫ్‌స్ట్రూమ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జ‌రిగిన మొదటి T 20లో భార‌త్ మ‌హిళ‌ల జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది.  టాస్ గెలిచి భారత మహిళలు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో… బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి భారత్ ముందు 165 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

తర్వాత 165 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భార‌త్ మ‌హిళ‌ల జ‌ట్టు 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. మిథాలీరాజ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో విజయంలో కీలకపాత్ర పోషించింది.

Posted in Uncategorized

Latest Updates