ఉమెన్స్ క్రికెట్ : సిరీస్ డిసైడ్ మ్యాచ్ లో భారత్ ఫీల్డింగ్

DWTVclpX0AAsdrAఉమెన్స్ క్రికెట్ లో భాగంగా బుధవారం (ఫిబ్రవరి-21) సెంచూరియన్ లో సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. ఐదు మ్యాచ్‌ల మహిళల సిరీస్‌లో ప్రస్తుతం హర్మన్‌ప్రీత్‌ సేన 2–1 ఆధిక్యంలో ఉంది. తొలి రెండు అలవోకగా గెలిచినా… మూడో మ్యాచ్‌లో అనవసర షాట్లతో మన జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. దీంతో సౌతాఫ్రికాకు పుంజుకొనే అవకాశం చిక్కింది. ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ గెలిస్తే సిరీస్ తో పాటు చరిత్ర సృష్టిస్తుంది భారత్.

Posted in Uncategorized

Latest Updates