ఉమెన్స్ క్రికెట్: సౌతాఫ్రికా చిత్తు..భారత్ దే సిరీస్

womenకింబర్లే వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే కూడా భారత మహిళా టీం విజయం సాధించింది.178 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విక్టరీ సాధించింది. టాస్ కోల్పోయి మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 302 పరుగుల భారీ స్కోరు చేసింది. 303 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు 30.5 ఓవర్లలో124 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. లిజ్లే లీ 73, మారిజన్నే కాప్ 11 పరుగులు చేయగా..మిగతా ఆటగాళ్లు అంతగా రాణించలేక పోయారు.

భారత బౌలర్లు పూనమ్ యాదవ్ 4 వికెట్లు తీసుకుంది. దీప్తీ శర్మ,రాజేశ్వరీ చెరో 2 వికెట్లు పడగొట్టగా గోస్వామి ఒక వికెట్ తీసుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు ఓపెనర్ పూనం రౌత్ (20), కెప్టెన్ మిథాలీ రాజ్(20)ల వికెట్లు త్వరగా కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ స్మృతి మందనా చెలరేగి ఆడి సెంచరీ చేయడంతో భారత్ స్కోరు పరుగులు తీసింది. స్మృతి మందనకు తోడుగా హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ చేసింది. స్మృతి మందనా(135) ఔటయిన తర్వాత క్రీజ్ లోనికి చవ్చిన వేదా కృష్ణమూర్తి చివరిలో ధాటిగా ఆడి 33 బంతుల్లోనే ఆరు ఫోర్లు ఒక సిక్స్ తో 51 పరుగులు చేసింది.

దక్షిణాఫ్రికా బౌలర్లు మసబటా క్లాస్, రైసిబే నోటజాఖే, సునే లూయస్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates