ఉమెన్స్ టీ20 ట్రై సిరీస్ : చివరి మ్యాచ్ లో భారత్ విక్టరీ

MATCHహ్యాట్రిక్‌ ఓటముల తర్వాత భారత మహిళల జట్టు విక్టరీ సాధించింది.  టీ20 ట్రై సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో గురువారం (మార్చి-29) జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ స్మృతి మంధాన చెలరేగి ఆడటంతో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది టీమిండియా.  టాస్‌ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 18.5 ఓవర్లలో 107 పరుగులు చేసి ఆలౌటయ్యింది. ఈ సిరీస్‌లో ఇదే చివరి మ్యాచ్‌. ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావించిన టీమిండియా.. 108 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగింది. ఓపెనర్‌ స్మృతి మంధాన మరోసారి చెలరేగి ఆడింది.

41 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 62 పరుగులు చేసింది. దీంతో 15.4ఓవర్లలోనే భారత్‌ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ని ఫినిష్ చేసింది. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్‌లో భారత్‌కు ఇదే ఫస్ట్ విక్టరీ. అంతకుముందు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్‌ ఓడిపోయింది. దీంతో ఫైనల్‌ రేసులో నిలవలేకపోయింది. దీంతో ఈ రోజు భారత్‌ – ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ నామమాత్రపు పోరే. శనివారం ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ మధ్య ఫైనల్‌ జరగనుంది. భారత బౌలర్లలో.. అనూజ పాటిల్‌కు 3, దీప్తి శర్మ, రాధ యాదవ్‌, పూనమ్‌ యాదవ్‌కు తలో రెండు, పూజకు ఒక వికెట్ దక్కింది. అనూజ పాటిక్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Posted in Uncategorized

Latest Updates