ఉమెన్స్ టీ20 ట్రై సిరీస్ : నేడు ఇంగ్లాండ్ తో భారత్ ఢీ

matchటీ20 ట్రై సిరీస్ లో భాగంగా ఆదివారం (మార్చి-25)న ముంబైలో ఇంగ్లాండ్ తో తలపడనుంది భారత మహిళల జట్టు. ఇప్పటికే వరుస ఓటములతో టీమిండియా తీవ్రంగా సతమతమవుతోంది.  సౌతాఫ్రికా టూర్ తర్వాత ఇప్పటివరకూ ఆడిన ఓ మ్యాచ్‌లోనూ మహిళలు గెలిచింది లేదు.

ఈ క్రమంలో ఇవాళ  ఇంగ్లాండ్‌ మహిళలతో జరుగనున్న టీ20పైనే ఆశలన్నీ. ఆదివారం మ్యాచ్‌తో వరుస వైఫల్యాల నుంచి తిరిగి జట్టును విజయబాట పట్టించేందుకు నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు భారత టీ20 కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ తెలిపారు. భారత మహిళల జట్టు గత రెండు నెలలుగా నిరంతరాయంగా క్రికెట్‌ ఆడుతోంది. ఈ క్రమంలో ముందుగా దక్షిణాఫ్రికా జట్టుపై సిరీస్‌ విజయాన్ని నమోదు చేసుకున్నా, ఆస్ర్టేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మాత్రం తడబడ్డాబడ్డామని చెప్పారు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లోనూ తొలి మ్యాచ్‌లో ఆస్ర్టేలియాపైనే ఓడామన్నారు.

నిరంతరాయంగా మ్యాచ్‌లు ఆడుతుండటం వల్లనే ఓడిపోతున్నామని కొందరు విమర్శిస్తున్నారని..  ఆ వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అస్సలు వెంటవెంటనే రెండు అంతర్జాతీయ సిరీస్‌లు ఉండటం తమకు బాగా కలిసొచ్చే అంశమని చెప్పింది. అలసిపోయామనే ఆలోచనే మాలో లేదని.. వరుసగా మ్యాచ్‌లు ఉండటం వల్ల మేము ఆటను బాగా ఆస్వాదిస్తున్నామని తెలిపారు. బీసీసీఐ నుంచి మేము కోరుకునేది ఇదేనంటూ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ వివరించింది. మరోవైపు శుక్రవారం ఆస్ర్టేలియా మహిళల జట్టుపై ఇంగ్లాండ్‌ మహిళల జట్టు 8వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫామ్‌ మీదన్న ఇంగ్లాండ్‌ను భారత మహిళలు ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.
మ్యాచ్ ఆదివారం (మార్చి-25) ఉదయం 10 గంటలకు

Posted in Uncategorized

Latest Updates