ఉమెన్స్ టీ20 ట్రై సిరీస్ : భారత్ బ్యాటింగ్

ఉమెన్స్ టీ20 ట్రై సిరీస్ లో భాగంగా ఆదివారం (మార్చి-25)న ముంబైలో భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. ఇప్పటికే వరుస ఓటములతో టీమిండియా తీవ్రంగా సతమతమవుతోంది. సౌతాఫ్రికా టూర్ అనంతరం ఇప్పటివరకూ ఆడిన ఓ మ్యాచ్‌లోనూ మహిళలు గెలిచింది లేదు. ఈ క్రమంలో ఇవాళ ఇంగ్లాండ్‌ మహిళలతో జరుగనున్న టీ20పైనే ఆశలన్నీ. ఆదివారం మ్యాచ్‌తో వరుస వైఫల్యాల నుంచి తిరిగి జట్టును విజయబాట పట్టించేందుకు నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్‌ చేసినట్లు తెలిపారు భారత టీ20 కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌.

Posted in Uncategorized

Latest Updates