ఉమెన్స్ టీ20: దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు

mithalirajదక్షిణాఫ్రికా మహిళ జట్టుతో జరుగుతున్న రెండో టీ-20 మ్యాచ్‌లో భారత మహిళ జట్టు ఘన విజయం సాధించింది. శుక్రవారం(ఫిబ్రవరి-16) జరిగిన రెండో టీ20లోనూ సఫారీలపై హర్మన్ ప్రీత్ కౌర్ సేన 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన  సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 142 పరుగులు చేసింది. దీంతో 143 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియా ఓపెనర్లు మిథాలీ రాజ్, స్మృతి మంధాన చెలరేగి ఆడారు. భారత్ 19.1 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 144 పరుగులు చేసి విజయం సాధించింది. భారత్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.

 

Posted in Uncategorized

Latest Updates