ఉమెన్స్ IPL : హర్మన్ సేనదే విక్టరీ

IPL WOMENఉమెన్స్ IPLలో భాగంగా మంగళవారం (మే-22) వాంఖడే వేదికగా ట్రయల్‌ బ్లేజర్స్‌ తో జరిగిన మ్యాచ్ లో సూపర్‌ నోవా 3 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన మంధాన సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన హర్మన్ టీమ్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 130 పరుగులు చేసి విజయం సాధించింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఫైనల్ గా హర్మన్ సేన గెలుపొందింది.

సూపర్‌ నోవా బ్యాట్స్ మెన్లలో ..మిథాలీ రాజ్(22),డానియెల్లీ(24), మెగ్ లన్నింగ్(16),డివైన్(19)  హర్మన్  (21), పెర్రీ (13)  పరుగులతో తలో చేయి వేసి విజయం సాధించారు.
ట్రయల్‌ బ్లేజర్స్‌ బౌలింగ్ లో..పూనమ్ యాదవ్(2), ఏక్తా బిష్(1), బాట్స్ (2), గోస్వామి(1) వికెట్లు తీశారు.
IPL సీజన్-11లో భాగంగా జరగనున్న ఫస్ట్ క్వాలిఫయర్ (హైదరాబాద్-చెన్నై) మ్యాచ్ సందర్భంగా ఈ ఉమెన్స్ టీ20 నిర్వహించిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్-చెన్నై మధ్య రసవత్తర పోరు జరగనుంది.

Posted in Uncategorized

Latest Updates