ఉమెన్స్ T-20: భారత్ దే సిరీస్

captain-mithదక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళా క్రికెట్‌ జట్టు రికార్డు సృష్టించింది. కేప్ టౌన్ వేదికగా శనివారం(ఫిబ్రవరి-24) జరిగిన ఐదవ టీ20లో భారత్‌  గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయిదు టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో గెలుచుకుంది. చివరి మ్యాచ్ లో భార‌త్ నిర్దేశించిన 167 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని చేధించ‌లేక స‌ఫారీలు 18 ఓవ‌ర్ల‌లో 112 ప‌రుగులు చేసి ఆలౌట్ అయ్యారు. భార‌త్ బౌల‌ర్ల‌లో రుమేలీ ధ‌ర్ , గైక్వాడ్ ,శిఖాపాండే చెరో మూడేసి వికెట్లు ప‌డ‌గొట్టారు. అంత‌కుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భార‌త్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 166 ప‌రుగులు చేసింది. మిథాలీ రాజ్ (62) అర్థ‌సెంచ‌రీకి తోడు జెమిమా రోడ్రిగ్స్ 44 , కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ 27 ప‌రుగుల‌తో దూకుడుగా ఆడి ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో కేప్‌, ఖకా, ఇస్మాయిల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ఒకే ప‌ర్య‌ట‌న‌లో రెండు సిరీస్‌లు గెలిచిన తొలి జట్టుగా భారత మహిళల క్రికెట్ జట్టు రికార్డు సృష్టించింది.

Posted in Uncategorized

Latest Updates