ఉమెన్ క్రికెట్: మూడో T20 లో దక్షిణాఫ్రికా విజయం

women-cricవాండరర్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న T20 సిరీస్ లో ఆదివారం(ఫిబ్రవరి-18) జరిగిన మూడో మ్యాచ్ లో భారత ఉమెన్స్ జట్టు ఓడిపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 17.5 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత నిర్ణీత ఓవర్లలో 134 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 19ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. దీంతో 5 టీ20ల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యతతో ఉంది.

ఇందులో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాలనుకున్న టీమిండియా ఆశలు నెరవేరలేదు.

Posted in Uncategorized

Latest Updates