ఉమ్మడి పీజీసెట్ కు కసరత్తు

tschelogoఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్ తదితర పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశ పరీక్షలను ఈసారి అన్ని యూనివర్సిటీలకు కలిపి ఉమ్మడిగా నిర్వహించాలని కసరత్తు చేస్తుంది ఉన్నత విద్యామండలి. ఈ పరీక్షలను తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని యోచిస్తున్నది. ఇప్పటికే ఎంసెట్‌తోపాటు ఐసెట్, ఎడ్‌సెట్, పీజీఈసెట్ వంటి ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, కేయూ వీసీ ప్రొఫెసర్ సాయన్న, ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వెంకటరమణలతో సమావేశమయ్యారు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి. రాష్ట్రంలోని ఆరు వర్సిటీల్లో పీజీ అడ్మిషన్ల కోసం ఉమ్మడి ప్రవేశపరీక్ష మార్గదర్శకాల రూపకల్పనపై చర్చించారు. మార్చి మొదటివారంలో పీజీసెట్ నోటిఫికేషన్ జారీచేయాలని భావిస్తున్నారు. రాతపరీక్ష తేదీతోపాటు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ, పీజీసెట్ నిర్వహణ బాధ్యతల అప్పగింత, కన్వీనర్ నియామకం, సిలబస్ రూపకల్పనపై త్వరలో ఏర్పాటుచేసే వీసీల సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు పాపిరెడ్డి.

Posted in Uncategorized

Latest Updates