ఉమ్మినా, సిగరెట్ తాగినా, ముక్కు చీదినా జైలుకే..!

మహారాష్ట్ర సర్కార్ కొత్త నిబంధనలు
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండటంతో మహా వికాస్ అఘాడీ సర్కార్ కొత్త నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ప్లేసుల్లో ఎవరైనా ఉమ్మేస్తూ, సిగరెట్ తాగుతూ లేదా ముక్కు చీదుతూ కనిపిస్తే వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఓ నోటిఫికేషన్ ను విడుదల చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం.. నిబంధలను అతిక్రమిస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష వేస్తామని హెచ్చరించింది. రెండోసారి కూడా రూల్స్ ను బ్రేక్ చేస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని స్పష్టం చేసింది. ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్, 1897 కింద ఆ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ ఈ నిబంధనను అమలు చేసింది.

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం ద్వారా కరోనా ఇన్ఫెక్షన్స్ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందన్న భయాల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్ ఈ డెసిజన్ తీసుకుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా తమ రాష్ట్రంలోనే హయ్యస్ట్ కరోనా కేసులు ఉన్నందున.. పబ్లిక్ ప్లేసుల్లో ఉమ్మి వేయడం, సిగరెట్ తాగడంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మహారాష్ట్ర పబ్లిక్ హెల్ల్ మినిస్టర్ రాజేశ్ తోపే చెప్పారు. ‘కరోనా వ్యాప్తిలో ఉమ్మడం కూడా ఓ భాగమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిషేధ చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించాం’ అని తోపే పేర్కొన్నారు.

Latest Updates