ఉమ్మి ప్యాడ్ ఆవిష్కరణ : ఊసి జేబులో పెట్టుకోవచ్చు

ummiరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడో, పార్క్ లోనో, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనో కొంతమంది తుపుక్ తుపుక్ అంటూ ఉమ్మి వేయటం నిత్యం చూస్తూనే ఉంటాం. పాన్ మసాలాలూ తింటూ ఎక్కడ పడితే అక్కడ ఊస్తుంటారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టినా ప్రయోజనం లేదు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎన్నో స్వచ్చంధ సంస్థలు ఈ విషయంలో ప్రచారం కూడా కల్పించాయి. అయినా మార్పు రావటం లేదు. ఈ క్రమంలోనే ఓ కొత్త ఆవిష్కరణ జరిగింది.

ఇలాంటి సమయంలో నేను సైతం స్వచ్చ భారత్ కోసం అంటూ ఓ యువతి, ఇద్దరు యువకుడు ముందుకొచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవ్వరూ ఉమ్మి వేయకుండా, ఉమ్మిని తమ జేబులో ఉంచుకునేలా ఓ ప్రయోగంతో ముందుకొచ్చారు. నాగ్ పూర్ కి చెందిన ప్రతీక్ మల్హోత్రా, రితూ మల్హోత్రా, ప్రతీక్ హార్డే లు కలసి పర్యావరణ హితంగా పేపర్, పల్ఫ్, పాలీమర్ తో తయారు చేసిన ఓ ఉమ్మి ప్యాడ్ ను ఆవిష్కరించారు. మనకు ఉమ్మి వచ్చినప్పుడు.. అందులో ఉమ్మడం ద్వారా దానిలోపల ఉండే ప్యాడ్ ఆ ఉమ్మిని గ్రహిస్తుంది. దీనిని సులభంగా మనం జేబులో పెట్టుకుని.. ఆ తర్వాత చెత్తకుండీలో పడేయవచ్చు. పర్యావరణాన్ని క్లీన్ గా ఉంచడమే ఈ ప్రొడెక్ట్ ఉద్దేశమని వారు తెలిపారు. ఇటీవల ఈ ప్రొడెక్ట్ కి జాతీయ పేటెంట్ కూడా దక్కింది.

Posted in Uncategorized

Latest Updates