ఉయ్యాలవాడ వేషధారణలో టీడీపీ ఎంపీ

ఢిల్లీలో టీడీపీ ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీకి ప్రత్యేక ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు నేతలు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వేషదారణలో నిరసన చేశారు. ఆంధ్రప్రదే శ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వివిధ వేషధారణలో నిరసన తెలిపే టీడీపీ ఎంపీ శివప్రసాద్.. బుధవారం (జూలై-25) కూడా అదే రీతిలో నిరసనకు దిగారు. ఉయ్యాలవాడ నర్సింహ వేషధారణలో గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. సై..రా నర్సింహారెడ్డి.. నీ పేరే బంగారుకడ్డీ.. నీవేమో పదునైన కత్తి అంటూ పాట పాడతూ నిరసన వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates