ఉరితీసెయ్యండి : మెదటి క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన కోవింద్

kovindరాష్ట్రపతి అయిన తర్వాత మొట్టమొదటి క్షమాభిక్ష పిటిషన్‌ ను తిరస్కరించారు రాంనాథ్‌ కోవింద్‌. ఏడుగురిని సజీవదహనం చేసిన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించేందుకు కోవింద్ నిరాకరించారు. బీహార్ లోని వైశాలి జిల్లాలో 2006లో రఘోపూర్ బ్లాక్ కు చెందిన విజేంద్ర మహతో, ఆయన కుటుంబ సభ్యులను అతి దారుణంగా హత్య చేసి సజీవదహనం చేసిన కేసులో 2013 లో జగత్‌ రాయ్‌ అనే వ్యక్తికి సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. అయితే తనకు క్షమాభిక్ష పెట్టాలంటూ ఈ ఏడాది ఏప్రిల్‌ 23న జగత్‌ రాయ్‌ రాష్ట్రపతి కోవింద్‌కు విజ్ఞప్తి చేసుకున్నాడు. అయితే జగత్‌ రాయ్‌ అభ్యర్థనను తిరస్కరించినట్లు రాష్ట్రపతి భవన్‌ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates