ఉరేసి చంపుతున్నారు : వెస్ట్ బెంగాల్ లో రాజకీయ హత్యల కలకలం

noteవెస్ట్ బెంగాల్ లో రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. రెండురోజుల క్రితం బుధవారం(మే-20) న పురులియా జిల్లాలోని బలరాంపూర్ గ్రామంలో చెట్టుకు శవమై 18 ఏళ్ల యువకుడు ఉండగా, శనివారం(జూన్-2) ఉదయం మళ్లీ ఇదే గ్రామంలో ఓ యువకుడు ఎలక్ట్రిసిటీ టవర్ కు శవమై వేలాడుతూ కన్సించాడు. ఇతడిని గోపాల్డి గ్రామానికి చెందిన దులాల్ కుమార్ గా గుర్తించారు. బాడీని పోస్ట్ మార్టం కోసం తరలించారు పోలీసులు.

దులాల్ మృతదేహం దగ్గర ఓ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ కోసం పనిచేసినందుకే ఈ పనిష్మెంట్ అని ఆ లెటర్ లో రాసి ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.దులాల్ తమ పార్టీ కార్యకర్త అని, మే-30 న చనిపోయిన యువకుడు కూడా తమ పార్టీ కార్యకర్తేనని బీజేపీ తెలిపింది. అధికార తృణముల్ కాంగ్రెస్ రాజకీయ హత్యలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపించింది.

Posted in Uncategorized

Latest Updates