ఉలిక్కిపడిన ఇండస్ట్రీ : హీరో హత్యకు కుట్ర జరిగిందా?

శాండిల్ వుడ్ స్టార్ హీరో యశ్ పై హత్యాప్రయత్నానికి ప్రయత్నం జరిగిందనే వార్త ఇప్పుడు కర్ణాటకలో కలకలం రేపుతోంది. పోలీసుల అదుపులో ఉన్న రౌడీ షీటర్.. సైకిల్ రవి విచారణ సమయంలో ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినట్లు  వార్తలు వచ్చాయి. రౌడీ షీటరు కోదండరామ ఈ హత్యకు సూత్రధారి అని వార్తలు వచ్చాయి. బెంగళూరు సీసీబీ అడిషనల్ పోలీస్ కమీషనర్ సతీశ్‌ కుమార్‌ ను యశ్ కలిసి, హత్యకు ప్రయత్నించిన వారి వివరాలను ఆరా తీసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో పలువురు కన్నడ నటులు, రాజకీయనాయకులు, పలువురు ప్రముఖులు యశ్ కు ఫోన్ చేసి పరామర్శించారు. అయితే ఇది కేవలం ప్రచారం మాత్రమేనని, ఇటువంటి వదంతులు సృష్టించినవారిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని, సీసీబీ విభాగం అదనపు పోలీసు కమిషనర్‌ సతీశ్‌ కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం రౌడీ షీటర్ కోదండరామ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
అయితే కొన్నిరోజుల క్రితం కన్నడ నటుడు ప్రకాశ్ రాజ్ పై కూడ హత్యాప్రయత్నం జరిగినట్లు వార్తలు వచ్చాయి. జర్నలిస్ట్ గౌరీ లంకేష్ ను హత్య చేసినవాళ్లే ప్రకాష్ రాజ్ ను చంపడానికి ప్రయత్నించినట్లు నిందితులు పోలీస్ విచారణలో అంగీకరించారు.

Posted in Uncategorized

Latest Updates