ఉస్మానియా లో కార్డన్ సెర్చ్: పోలీసుల అదుపులో ఇన్సురెన్స్ బ్రోకర్లు

cordern-searchహైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో ఫస్ట్ టైం ఈస్ట్ జోన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 100 మంది సిబ్బందితో కలిసి ఆస్పత్రి మొత్తాన్ని సెర్చ్ చేశారు. రోగులు, వారి సహాయకుల వివరాలను అడిగితెలుసుకున్నారు పోలీసులు. ఇందులో భాగంగా కొందరు ఇన్సురెన్స్ బ్రోకర్లతో పాటు.. రోగులకు మాయ మాటలు చెప్పి మోసం చేసే దళారులను అదుపులోకి తీసుకున్నారు. యాక్సిడెంట్ కేసుల్లో ఇన్సురెన్స్ ఇప్పిస్తామంటూ రోగులను ఇన్సురెన్స్ బ్రోకర్లు మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates