ఊపందుకున్న ప్రత్యేక ఉత్తర కర్నాటక డిమాండ్

ప్రత్యేక ఉత్తర కర్నాటక డిమాండ్ ఊపందుకుంది. 13 జిల్లాలలో కూడిన స్పెషల్ స్టేట్ ను ఏర్పాటు చేయాలని ఉత్తర కర్నాటక హోరాట సమితి UKHS పట్టుబడుతోంది. రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రుల్లో ఎక్కువమంది దక్షిణ కర్నాటక వాళ్లే కావడంతో… దశాబ్దాలుగా వివక్షకు గురైందన్నది UKHS అభిప్రాయం. నార్త్ కర్నాటక జనాభా రాష్ట్ర జనాభాలో 42.6 శాతం ఉంటుందని అంచనా. 2000 సంవత్సరంలో సామాజిక ఉద్యమకారుడు వైజయంత్ పాటిల్ ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఒకప్పుడు నిజాం పాలన కింద ఉన్న ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నది వీళ్ల డిమాండ్. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ ఉత్తర కర్నాటకకు అన్యాయం జరిగిందని విమర్శలు మొదలయ్యాయి. దాంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తీవ్రమైంది. ఉద్యమంలో భాగంగా రేపు బంద్ కు పిలుపునిచ్చింది UKHS.

Posted in Uncategorized

Latest Updates