ఊహించని షాక్ : అభ్యర్థుల కొంపముంచిన నోటా

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొందరికి ఊహించని షాక్ ఇచ్చాయి. ఇందుకు కారణం నోటా అని స్పష్టమవుతుంది. ఐదు నియోజకవర్గాల్లో తిరస్కరణ ఓటు (నోటా) గెలుపు ఓటములను మార్చేసింది. ఈ ఐదు చోట్లా విజేతల మెజారిటీ 4,444 కాగా.. నోటాకు 10,199 ఓట్లు పోలయ్యాయి. 2014లో జరిగిన తెలంగాణ ఫస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో నోటా (1.25 లక్షల ఓట్లు) ప్రభావం గెలుపు ఓటములను ప్రభావం చేసేంతగా లేకున్నా.. ఈసారి మాత్రం అభ్యర్థుల జాతకాలు మార్చేసింది. ఓటింగ్‌ శాతంలో నోటా ఏడో స్థానాన్ని కైవసం చేసుకుంది. 119 నియోజకవర్గాల్లో నోటాకు 2.2 లక్షల ఓట్లు పోలయ్యాయి.

నోటా శాసించిన నియోజకవర్గాలు

-అంబర్‌పేట్‌ లో బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌రెడ్డి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. TRS అభ్యర్థి కాలేరు వెంకటేశం 61,558, కిషన్‌ రెడ్డి 60,542 ఓట్లు సాధించారు. వీరి ఓట్లలో తేడా 1,016 మాత్రమే. నోటాకు పడినవి 1,462 ఓట్లు.

-ఖమ్మం జిల్లా వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థి రాములు 52,650 ఓట్లతో గెలుపొందారు. రెండో స్థానంలో నిలిచిన TRS అభ్యర్థి బానోత్‌ మదన్‌ లాల్‌ 50,637 ఓటు సాధించారు. మెజార్టీ కేవలం 2,013 ఉండగా.. నోటాకు 2,360 ఓట్లు పోలయ్యాయి.

-తుంగతుర్తి TRS అభ్యర్థి గ్యాదరి కిశోర్‌కుమార్‌ 199ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ నోటా సంఖ్య 1,175

టాప్‌-10 ‘నోటా’ నియోజకవర్గాలు

వర్ధన్నపేట (5,864), హుస్నాబాద్‌ (3,534), ఖమ్మం (3,513), ఆలంపూర్‌ (3,492), మేడ్చల్‌ (3,402), మహబూబాబాద్‌ (3,279), ములుగు (3,249), మునుగోడు (3,086), వరంగల్‌-వెస్ట్‌ (3,075), హుజూరాబాద్‌ (2,867)

Posted in Uncategorized

Latest Updates