ఊహించని షాక్ : ఆయువు తీసిన గో-కార్ట్ రేసింగ్

Woman-Dies-Go-Kartపంజాబ్ రాష్ట్రంలో ఘోరం. ఒక్కసారిగా షాక్. సాయంత్రం పూట సరదాగా అమ్యూజ్ మెంట్ పార్క్ వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం. గో-కార్ట్ రేసులో ఊహించని విధంగా మహిళ జుట్టు ఇరుక్కుని.. చనిపోయింది. వివరాల్లోకి వెళితే..

రాంపురపూల్ బత్తిండకి చెందిన పునీత భర్త అమర్ సింగ్, రెండేళ్ల కుమారుడితో కలిసి ఫిబ్రవరి 14వ తేదీ బుధవారం సాయంత్రం సరదాగా పింజోరేలోని యాదవీంద్ర గార్డెన్స్ కి వెళ్లింది. అక్కడ గో-కార్ట్ రేసు చేశారు. డ్రైవింగ్ సీట్లో భర్త, ఆ పక్కనే భార్య పునీత కూర్చున్నది. మొదటి రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత.. రెండో రౌండ్ చేసే సమయంలో.. పునీత జుట్టు కారు చక్రంలో ఇరుక్కుపోయింది. అప్పటికే కారు స్పీడ్ లో ఉంది. అదే సమయంలో జుట్టు ఇరుక్కోవటం జరిగింది. తలమొత్తాన్ని వెనక్కి తాగేసింది. జుట్టు చాలా భాగా ఊడి వచ్చింది. తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే కారు ఆపినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయింది. జుట్టు ఊడిరావటంతో.. రక్తం ఎక్కువగా పోయిందని చెప్పారు డాక్టర్లు.

పునీత ఘటనతో అమ్యూజ్ మెంట్ నిర్వహకులు కూడా షాక్ అయ్యారు. అప్పటికే పార్క్ కు వచ్చిన వారు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సాయంత్రంపూట సరదాగా పార్క్ వచ్చిన అమర్ సింగ్ కుటుంబంలో విషాదం నెలకొంది.

 

Posted in Uncategorized

Latest Updates