ఊహించని షాక్ : శ్రీదేవి చివరి క్షణాలు ఎలా గడిచాయి

7
అతిలోక సుందరి శ్రీదేవి ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కన్నుమూశారు. ఆమె అప్పుడు దుబాయ్ లో ఉన్నాయి. తన మేనల్లుడి పెళ్లికి హాజరయ్యారు. పెళ్లిలో చాలా సంతోషంగా, ఉల్లాసంగా గడిపారు. ఎప్పుడూ లేనంత ఎనర్జీతో ఉన్నారు. చాలా రోజుల తర్వాత బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరుకావటంతో.. అందర్నీ పేరు పేరున పలకరించారు. బాబాయ్ ఎలా ఉన్నారు.. పిన్ని ఆరోగ్యం ఎలా ఉంది.. తమ్ముడు ఏం చేస్తున్నావ్.. అక్క బావ ఆరోగ్యం ఎలా ఉంది.. ఇలా ప్రతి ఒక్కరినీ వరసలతో కలిపి మరీ కుశల ప్రశ్నలు వేశారు. అందరి దగ్గరకి వెళ్లి మరీ మరీ పలకరించారు. మేనల్లుడి పెళ్లిలో తనదే సందడి అయ్యింది.

పెళ్లికి కుటుంబ సభ్యులతో హాజరైన శ్రీదేవి.. కూతురు ఖుషీతో కలిసి సెల్ఫీలు దిగారు. భర్త బోనీకపూర్ తో కలిసి ఫ్యామిలీ ఫొటోలతో సందడి చేశారు. ఎంతో ఉల్లాసంగా, సరదాగా ఉంటున్న టైంలోనే.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. గుండెపోటు వచ్చినట్లు గుర్తించారు వైద్యులు. వెంటనే చికిత్స మొదలుపెట్టినా ఫలితం లేకుండా పోయింది.

అప్పటి వరకు ఎంతో సరదాగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్న శ్రీదేవి ఇకలేరు అన్న విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు. చివరి క్షణాల్లో కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా గడిపిన శ్రీదేవికి.. అదే చివరి చూపు అవుతుందని ఎవరూ ఊహించలేదు. విధిరాత అంటే ఇదే కదా…

Posted in Uncategorized

Latest Updates