ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్‌

హైదరాబాద్‌: ఎఐఎంఐఎం శాసనసభాపక్షనేతగా చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిన్న(ఆదివారం) హైదరాబాద్‌ దారుస్సలాంలో పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. అక్బరుద్దీన్‌ ఒవైసీ శాసనసభాపక్షనేతగా ఎన్నిక కావడం ఇది ఐదోసారి. అక్బరుద్దీన్‌ 1999లో రాజకీయ రంగ ప్రవేశం చేసి మొదటి పర్యాయమే చాంద్రాయణగుట్ట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇక్కడ గతంలో వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన రాజకీయ ప్రత్యర్థి, మజ్లిస్‌ బచావో తెహ్రీక్‌ (ఎంబీటీ) అధినేత మహ్మద్‌ అమానుల్లాఖాన్‌ను ఓడించి అక్బరుద్దీన్‌ మొదటిసారి అసెంబ్లీలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి అక్బరుద్దీన్‌ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates