ఎంజాయ్ చేయండి : ఎయిర్‌టెల్ IPL ఆఫర్

airtel
జియోకు పోటీగా రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్‌ తీసుకొచ్చింది ఎయిర్‌టెల్. ఐపీఎల్ గేమ్స్ హంగామా క్రమంలో.. జియోకి పోటీగా ఎయిర్‌టెల్‌ ఈ ప్లాన్ ప్రకటించింది. ఎయిర్ టెల్ టీవీ యాప్‌లలో ఉచితంగా క్రికెట్ మ్యాచ్ లు చూసే అవకాశం కల్పించింది ఎయిర్ టెల్.

జియో ప్రవేశపెట్టిన రూ.251 ప్లాన్‌కు పోటీగా ప్రస్తుతం ఎయిర్‌టెల్ రూ.499 ప్లాన్‌ ప్రవేశపెట్టింది. ఇందులో కస్టమర్లకు రోజుకు 2GB 4G డేటా చొప్పున 82 రోజుల వాలిడిటీతో మొత్తం 164GB డేటా లభిస్తుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు ఈ ప్లాన్‌లో ఉన్నాయి. ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకునే కస్టమర్లకు రోజూ లభించే 2GB డేటాను ఉపయోగించుకుని ఐపీఎల్ మ్యాచ్‌లను ఎయిర్‌టెల్ టీవీ యాప్‌లో చూడొచ్చు…

Posted in Uncategorized

Latest Updates