ఎంజాయ్ చేస్తున్నారు : కొత్త అందాలతో గౌరి గుండాల జలపాతం

పెద్దపల్లి జిల్లా సబ్బితం మండలంలోని… గౌరి గుండాల జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. నాలుగు రోజులుగా పడుతున్న వానలతో జలపాతం కొత్త అందాలను సంతరించుకుంది. రెండు కొండల మధ్య నుంచి జాలువారే జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. చూట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్ల మధ్య జలపాతంలో స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి కేవలం 13 కి.మీ దూరంలో ఉన్న జలపాతానికి సందర్శకుల సంఖ్య పెరిగింది. అయితే కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు జనం.

Posted in Uncategorized

Latest Updates