ఎండదెబ్బకు రైలు పట్టాలే ఒంగిపోయాయి

mumbai traintracKఎండ తీవ్రతకు మనుషులే కాదు ..ఇనుపరాడ్లు సైతం వంగిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు రైల్వే ట్రాక్స్ దెబ్బతింటున్నాయి. ఎండ వేడికి ముంబై సమీపంలోని బాదల్పూర్-అంబేర్నాథ్ మధ్య మంగళవారం (మార్చి-27) పట్టాలు వంగిపోయాయి. దీంతో పలు రైళ్లను క్యాన్సిల్ చేశారు. ట్రాక్స్ మరమ్మత్తులు చేయడానికి అరగంట సమయం పట్టింది.

అయితే ఎండ తగలకుండా పట్టాలపై ఆకులను పేర్చారు రైల్వే సిబ్బంది. ఆకులు ఇనుమును చల్లబరుస్తుందని ఇలా చేశామని చెప్పారు. అయితే దీనిపై ప్రయాణికుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు దేశంలో బుల్లెట్ ట్రైన్స్ తీసకువస్తామని గొప్పలు చెప్పే రైల్వేశాఖ..సాధారణ పట్టాలనే సరిగ్గా వేయడంలేదంటున్నారు. ప్యాసింజర్ రైలు స్పీడునే తట్టుకోని ట్రాక్స్ బుల్లెట్ వేగాన్ని ఎలా తట్టుకుంటాయని సీరియస్ అవుతున్నారు. ముఖ్యంగా స్ట్రాంగ్ పట్టాలు వేయాల్సింది పోయి ఇలా పట్టాలపై ఆకులు పెట్టడం పెద్ద జోకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Posted in Uncategorized

Latest Updates