ఎండలు పెరిగాయి : భద్రాద్రి భగ్గుమంటోంది

bhadrachalam

రాష్ట్రంలో ఎండలు పెరిగాయి. టెంపరేచర్ సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికంగా నమోదు అవుతుంది. ఉక్కబోత ఫీలింగ్ కలిగిస్తోంది. ఈసారి ఎండలు ఎక్కువగా ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలు నిజం అయ్యేలా ఉన్నాయి. అప్పుడే అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరింది. భద్రాచలంలో ఇది నమోదైంది. ఇది సాధారణం కంటే అధికం. ఇక నిజామాబాద్‌, రామగుండంలో 37.3, ఆదిలాబాద్‌లో 37.1, మెదక్‌లో 37, మహబూబ్‌నగర్ లో 36.6, హైదరాబాద్‌లో 35.8, ఖమ్మంలో 35.6, హన్మకొండలో 35.5, హకీంపేటలో 33.7 డిగ్రీల మేరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఒక్క పగటి ఉష్ణోగ్రతలు పెరగటమే కాదు.. రాత్రి టెంపరేచర్ కూడా సాధారణం కంటే తక్కువగా నమోదు అవుతుంది. హైదరాబాద్ లో 16 డిగ్రీలుగా ఉంది. సాధారణం కంటే తక్కువగా నమోదు అవుతున్నాయి. మెదక్ లో 13, రామగుండంలో 16, మహబూబ్‌నగర్ లో 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో వారం, పది రోజుల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది..

 

 

Posted in Uncategorized

Latest Updates