ఎండలో చల చల్లగా : సిటీలో తాటి ముంజల సీజన్ మొదలైంది

toddy-fruitతాటి ముంజల సీజన్ మొదలైంది. సిటీలో ఎక్కడ చూసినా ఐస్ ఆపిల్స్ గా పిలిచే తాటి ముంజలు కనిపిస్తున్నాయి. ప్రకృతి ప్రసాదంగా వేసవిలో దొరికే తాటి ముంజలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.
సిటీలో మామిడి పండ్లతో పాటు ముంజల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాల నుంచి వచ్చిన గీతా కార్మికులు .. రోడ్లపై ముంజలను అమ్ముతున్నారు. వేసవిలో ముంజలు తింటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు జనం. వీటిలో తక్కువ కొవ్వు పదార్థాలు ఉండటం వల్ల చిన్నారులతోపాటు షుగర్ , అధిక బరువు, బీపీతో బాధపడుతున్నవారికి మేలు చేస్తాయంటున్నారు. శరీరానికి శక్తినివ్వడంతో పాటు ఎండ నుంచి ఉపశమనం పొందేలా చేస్తాయంటున్నారు. ముంజలు ఎలాంటి కల్తీలేనివంటున్నారు జనం. ముంజలపై ఉండే పొట్టును కూర వండుకుని తింటే జీర్ణశక్తి పెరుగుతందని చెబుతున్నారు. గతంలో డజన్ ముంజలు 40 రూపాయలు ఉండేవి. ఇప్పుడు 60 రూపాయలకు ధర పెరిగింది. అయినా గిరాకీ బాగుందంటున్నారు వ్యాపారులు. మేనెలలో ధరలు తగ్గుతాయంటున్నారు. తాటి ముంజలతో పాటు వీటిలో ఉండే నీరు, పై పోట్టు అన్ని ఆరోగ్యానికి మంచివంటున్నారు జనం.

Posted in Uncategorized

Latest Updates