ఎంతలో ఎంత మార్పు : సింగం చెరువు తండా డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభం

nacharamహైదరాబాద్ సిటీ నాచారం ప్రాంతంలో సింగం చెరువు తండా అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది స్లమ్ ఏరియా అని. ఇది రెండేళ్ల కిందటి మాట. ఇప్పుడు అక్కడ స్లమ్ ఏరియా లేదు. అపార్ట్ మెంట్లు వెలిశాయి. అది కూడా ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు. తండాలోని 176 కుటుంబాలు ఏప్రిల్ 7వ తేదీ శనివారం మధ్యాహ్నం సామూహికంగా గృహప్రవేశాలు చేశారు. పండుగలా సాగిన ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యి.. కుటుంబాలకు శుభాకాంక్షలు చెప్పారు.

11 బ్లాకుల్లో 176 డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించారు. ఇందు కోసం రూ.13.64 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. 11 బ్లాకులను ఓ కాలనీగా తీర్చిదిద్దారు. సిమెంట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, మంచినీటి సరఫరా, LED లైటింగ్, కంపోస్టింగ్ గుంతల నిర్మాణంతో పాటు పిల్లలు ఆడుకోవటానికి ఆట స్థలం కూడా కేటాయించారు. ఒక్కో డబుల్ బెడ్ రూం 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. ఒక హాల్, రెండు బెడ్ రూమ్స్, కిచెన్ తో సుందరంగా తీర్చిదిద్దారు. 176 మంది లబ్ధిదారులు అందరూ కూడా గిరిజనులే కావటం విశేషం.

Posted in Uncategorized

Latest Updates